TYING A TENT ROPE : తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గోలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని శివలింగం పానుమట్టుకు తాడు కట్టిన ఘటనపై.. భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం YSR చేయూత పంపిణి కార్యక్రమంలో భాగంగా బిక్కవోలు గోలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణ బయట టెంట్ వేశారు. అయితే టెంట్ తాళ్లను ఆలయ ప్రాంగణంలో ఉన్న శివలింగం పానుమట్టుకు కట్టారు . ఈ ఘటనను గుర్తు తెలియని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఆలయ ఈవో ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు స్థానిక ఎస్సై బుజ్జిబాబు ఓ ప్రకటనలో తెలిపారు.
శివలింగం పానుమట్టుకు కట్టిన టెంట్ తాడు .. వీడియో వైరల్ - బిక్కవోలు గోలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం
TYING AT TENT ROPE TO SHIVALINGAM : వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో భాగంగా ఓ గుడి ఆవరణలో టెంట్ వేశారు. టెంట్ తాళ్లను కట్టడానికి ఎక్కడా ఖాళీ లేనట్లు తీసుకెళ్లి ఆలయ ప్రాంగణంలోని శివలింగం పానముట్టుకు కట్టారు. అయితే ఈ ఘటనను గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.
![శివలింగం పానుమట్టుకు కట్టిన టెంట్ తాడు .. వీడియో వైరల్ TYING AT TENT ROPE TO SHIVALINGAM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16473849-863-16473849-1664161923818.jpg)
TYING AT TENT ROPE TO SHIVALINGAM
శివలింగం పానుమట్టుకు కట్టిన టెంట్ తాడు .. వీడియో వైరల్
Last Updated : Sep 26, 2022, 9:33 AM IST