ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాడపల్లి వెంకటేశ్వర స్వామికి కానుకగా కంఠాభరణం - చిన్న తిరుపతి విశేషాలు తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి.. ఓ భక్తుడు బంగారు ఆభరణాన్ని బహుమతిగా అందజేశాడు.

Necklace gift to Vadapalli Venkateswara Swami
వాడపల్లి వెంకటేశ్వర స్వామికి కానుకగా కంఠాభరణం

By

Published : Sep 15, 2020, 9:19 AM IST

రాజమహేంద్రవరానికి చెందిన తెలిదేవర శ్రీనివాస్ శ్రీదేవి దంపతులు రూ.3.25 లక్షలు విలువ చేసే బంగారు కంఠాభరణాన్ని తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి కానుకగా సమర్పించారు.

65 గ్రాముల 540 మిల్లీగ్రాముల బంగారంతో ఈ కంఠాభరణాన్ని తయారు చేయించి దేవాదాయ శాఖ అధికారులకు అందజేశారు. వీరికి దేవస్థానం ఛైర్మన్ రమేష్ రాజు, ధర్మకర్త మండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ రాజు, అర్చక స్వాములు.. ధన్యవాదాలు తెలిపారు. స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు.

ABOUT THE AUTHOR

...view details