ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాంలో నిరాడంబరంగా దేవీ నవరాత్రులు - Devi Navratri celebrations started modestly in Yanam

తూర్పు గోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజైన నేడు దుర్గామాతను బాలా త్రిపుర సుందరిగా అలంకరించారు.

Devi Navratri celebrations started modestly in Yanam
యానాంలో నిరాడంబరంగా మొదలైన దేవీ నవరాత్రి ఉత్సవాలు

By

Published : Oct 17, 2020, 4:47 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజైన నేడు దుర్గామాతను బాలా త్రిపుర సుందరిగా అలంకరించారు. ఈ తొమ్మిది రోజులు రోజుకొక అవతారంలో అమ్మవారిని అలంకరించనున్నారు.

పడవల వీధిలో 1985 నుండి ప్రతి ఏటా దేవీ నవరాత్రులను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కరోనా నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించారు. సామూహిక కుంకుమ పూజలను రద్దు చేశారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిలిపివేశారు. భక్తుల శ్రేయస్సు దృష్ట్యా ఈ ఏడాది అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్లు నిర్వాహక కమిటీ తెలియజేసింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details