తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న దర్శన ఏర్పాట్లను జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ వేండ్ర త్రినాథరావు పరిశీలించారు.
సోమ, మంగళ వారాల్లో ప్రయోగాత్మక దర్శనాలకు అనుమతిస్తున్న తరుణంలో ఆలయ అధికారులతో చర్చించారు. మాస్క్ ధరించిన వారిని మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆలయ సిబ్బందికి సూచించారు.