రాజధాని రైతులపై చంద్రబాబుకు ఎలాంటి ప్రేమ లేదని... కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో మాట్లాడిన ఆయన.. చేతిలో అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు.
సంక్షేమ పథకాలపై ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి కోసం జగన్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎవరు సలహాలు ఇచ్చినా ప్రభుత్వం స్వీకరిస్తుందని తెలిపారు.