ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వారిద్దరూ రాష్ట్రానికి గర్వ కారణం: ధర్మాన కృష్ణదాస్ - ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వార్తలు

బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయి సాత్విక్, బాక్సర్ నగిశెట్టి ఉషలు భారత ప్రభుత్వ అత్యున్నత క్రీడా పురస్కారాలకు ఎంపిక కావడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ హర్షం వ్యక్తం చేశారు. వారిరువురూ ఎందరికో ఆదర్శంగా నిలిచి స్ఫూర్తిని నింపారని అన్నారు. సీఎం జగన్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దఎత్తున ప్రోత్సాహకాలు అందజేస్తోందని పేర్కొన్నారు.

deputy cm krishnadas praises sai satwik and usha for medals
ధర్మాన కృష్ణదాస్

By

Published : Aug 23, 2020, 4:17 PM IST

బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయి సాత్విక్, బాక్సర్ నగిశెట్టి ఉషలు భారత ప్రభుత్వ అత్యున్నత క్రీడా పురస్కారాలకు ఎంపిక కావడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ హర్షం వ్యక్తం చేశారు. సాత్విక్ అర్జున అవార్డుతోనూ, ఉష ధ్యాన్ చంద్ అవార్డుతో రాష్ట్ర కీర్తిని ఇనుమడింప చేశారని పేర్కొన్నారు. క్రీడా అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని ఉపముఖ్యమంత్రి ప్రకటించారు.

బ్యాడ్మింటన్ క్రీడాకారునిగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సాయి సాత్విక్ అర్జున అవార్డు సాధించడం ద్వారా ఆ రంగంలో ఎందరికో ఆదర్శంగా నిలిచి స్ఫూర్తిని నింపారని అన్నారు. 2021 టోక్యో ఒలింపిక్స్​లో పతకమే లక్ష్యంగా సాగుతున్న సాత్విక్ భారత కీర్తి పతాకను రెపరెపలాడించాలని ఆకాంక్షించారు.

విశాఖపట్టణం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన బాక్సర్ నగిశెట్టి ఉష ద్యాన్ చంద్ అవార్డుకు ఎంపిక కావడం ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. ఆమె వరల్డ్ ఛాంపియన్​షిప్​లో రెండు కాంస్య పతకాలు గెలవడమే కాకుండా, 2008 ఆసియా గేమ్స్​లో బంగారు పతకాన్ని సాధించారని గుర్తు చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం ఔత్సాహిక బాక్సర్ల కోసం విశాఖలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా బాక్సింగ్ శిక్షణ కేంద్రాన్ని నడుపుతున్నారని అభినందించారు. క్రీడాకారిణిగా ఉంటూ ఆట నుంచి రిటెరై క్రీడాభివృద్ధికి తోడ్పడే వారికి అందించే ధ్యాన్ చంద్ జీవితకాల సాఫల్య అవార్డు తొలిసారి నవ్యాంధ్రప్రదేశ్​కు, ఉత్తరాంధ్రకు చెందిన ఉషకు రావడం ఎంతో గర్వకారణమన్నారు.

సీఎం జగన్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దఎత్తున ప్రోత్సాహకాలు అందజేస్తోందని పేర్కొన్నారు. ఈ నెల 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వారిరువురూ అవార్డులు అందుకోనున్నారని, ఆ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి వారిని ఏపీ ప్రభుత్వం తరఫున అమరావతిలో సత్కరించనున్నారని కృష్ణదాస్ చెప్పారు.

ఇవీ చదవండి..

రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు... తగ్గని గోదావరి ఉద్ధృతి

ABOUT THE AUTHOR

...view details