ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులదే విజయం: ధర్మాన కృష్ణదాస్​ - Deputy cm dharmana Krishna Das latest news

పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా వైకాపా బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తారని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ధీమా వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో సమావేశం నిర్వహించారు.

Deputy cm dharmana Krishna Das latest news
పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులదే విజయం

By

Published : Feb 5, 2021, 4:51 PM IST

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని అన్ని పంచాయతీల్లో విజయం సాధించేలా కృషి చేయాలని.. వైకాపా బలపరిచిన అభ్యర్థులకు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సూచించారు. పార్లమెంటరీ నియోజవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వైకాపా ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అన్ని పంచాయతీల్లో అత్యధికంగా వైకాపా బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తారని ధర్మాన ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details