ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ - groceries distribution to poor people

తూర్పుగోదావరి జిల్లాలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ నిత్యావసర సరుకులు పంపిణి చేశారు. ఛాంబర్ అధ్యక్షులు గొల్లబాబు సేవలను కొనియాడారు.

east godavari district
నిత్యవసర సరుకులు పంచిన ఉప ముఖ్యమంత్రి

By

Published : Apr 20, 2020, 4:43 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో లాక్​డౌన్ ప్రారంభమైన దగ్గర నుంచి మండపేట పట్టణ ప్రజలకు చాంబర్ ఆఫ్ కామర్స్ అందిస్తున్న సేవలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రశంసించారు. ఛాంబర్ పరిధిలో వివిద షాపులలో పని చేస్తున్న సిబ్బందికి ఆయన నిత్యావసరాలను పంపిణీ చేశారు.

మండపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ప్రియా లాడ్జి వద్ద జరిగింది. మొత్తం 400 మంది సిబ్బందికి ఛాంబర్ తరుపున నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఛాంబర్ సభ్యులు సమర్థవంతంగా సేవలందిస్తున్నారని అభినందించారు. అనంతరం గొల్లబాబు మాట్లాడుతూ సుమారు 2 వేల మందికి పైగా నిత్యావసరాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. సామాజిక దూరాన్ని దృష్టిలో ఉంచుకుని తొలిరోజు కొద్దిమందికి మాత్రమే ఇచ్చినట్లు తెలిపారు. కొద్దిరోజుల పాటు వరుసగా పంపిణీ నిర్వహిస్తామని చెప్పారు.

ఇది చదవండిప్రభుత్వం పేదలను ఆదుకోవాలని తెదేపా నేత నిరాహార దీక్ష

ABOUT THE AUTHOR

...view details