తూర్పుగోదావరి జిల్లా వాసులను డెంగీ జ్వరాలు భయభంత్రులకు గురిచేస్తున్నాయి. జ్వరాలతో ప్రభుత్వాసుపత్రికి వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఐదుగురు చిన్నారులతో సహా మెుత్తం పదిమందికిపైగా రోగులు డెంగీ బారిన పడి కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. డెంగీ నిర్థరణ అయిన బాధితుల చికిత్స కోసం జీజీహెచ్ లో ప్రత్యేకంగా ఓ వార్డు ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి పర్యవేక్షకులు రాఘవేంద్రరావు తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో దోమలు విపరీతంగా పెరిగిపోతాయని.. దోమకాటుకు గురికాకుండా ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. దోమ తెరలు వినియోగించడం, దోమ లార్వాలు పెరిగేచోట కిరోసిన్ చల్లుకోవడం, ఒంటికి కొబ్బరి నూనె రాసుకోవడంవంటి జాగ్రత్తలు తీసుకుంటే డెంగీ బారిన పడకుండా జాగత్ర పడొచ్చని చెబుతున్నారు.
తూర్పు తీరాన్ని వణికిస్తున్న డెంగీ! - kakinada
తూర్పుగోదావరి జిల్లాలో డెంగీ బారిన పడి ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. బాధితుల కోసం కాకినాడ జీజీహెచ్లో వైద్యులు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.
బెంబేలెత్తిస్తున్న డెంగ్యూ జ్వరాలు