రంపచోడవరం నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని.... తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మీ, డీసీసీబీ ఛైర్మన్ అనంత బాబు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కోరారు. నియోజకవర్గ సమస్యలపై మంగళవారం రాత్రి ఆయన నివాసంలో కలిశారు. కొత్తగా ఏర్పడే జిల్లాల్లో రంపచోడవరం నియోజకవర్గాన్ని అరకు జిల్లాలో కలపటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని వారు సీఎంకు విన్నవించారు. ఏజెన్సీలో ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన రహదారులు నిలిచిపోయాయని.... వాటిని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.
రంపచోడవరాన్ని జిల్లా చేయాలని సీఎంకు వినతి
రంపచోడవరం నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే ధనలక్ష్మీ, డీసీసీబీ ఛైర్మన్ అనంత బాబు... ముఖ్యమంత్రి జగన్ను కోరారు.
సీఎంను కలిసిన రంపచోడవరం ఎమ్మెల్యే