తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలో కరోనా వైరస్ ప్రభావం వల్ల ఉపాధిని కోల్పోయిన సుమారు 100 మందికి న్యాయ సేవా అధికార కమిటీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణి చేశారు. జిల్లా జడ్జి ఆదేశాల మేరకు ఎంఎల్ఎస్సీ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి కె శ్యాంబాబు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎం.శివకిరణ్,అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎన్.ఉషాలక్ష్మి కుమారి చేతులు మీదుగా స్థానిక కోర్ట్ ఆవరణలో వస్తువులు అందించారు. ఈ కార్యక్రమానికి శ్రీఎస్పీవీఆర్ హైస్కూల్ 2004వ బ్యాచ్ విద్యార్థులు బియ్యం, కూరగాయలు సమకూర్చగా.. చందమామ వాసు అనే వ్యక్తి మాస్కులు, పిల్లా రామయ్య అనే వ్యక్తి అరటి పండ్లు అందించారు.
న్యాయసేవా అధికార కమిటీ సహకారంతో సరకుల పంపిణీ - ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలో ఉపాధిని కోల్పోయిన సుమారు 100 మందికి న్యాయ సేవా అధికార కమిటీ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

న్యాయసేవ అధికార కమిటీ సహకారంతో నిత్యావసర వస్తువులు పంపిణి
TAGGED:
east godavari district