తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కొలిమెరు గ్రామానికి చెందిన షేక్ గంగా బీబీకి... నెలలు నిండాయి. ఆమెను తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కాన్పు కష్టమవుతుందని కాకినాడ ఆసుపత్రికి వైద్యులు సిఫారసు చేశారు. మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువ అయ్యాయి. వెంటనే 108 వాహనాన్ని పక్కకు నిలిపి వైద్యం చేశారు. ప్రసవం చేశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని... పిఠాపురం ఆసుపత్రిలో చేర్చామని 108 సిబ్బంది తెలిపారు.
108 వాహనంలో ప్రసవం... తల్లీబిడ్డ క్షేమం - తూర్పుగోదావరిలో 108లో ప్రసవం న్యూస్
నెలలు నిండిన గర్భిణీని 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రసవించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
![108 వాహనంలో ప్రసవం... తల్లీబిడ్డ క్షేమం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5088178-229-5088178-1573924110420.jpg)
delivery in 108 vechile on road