తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం నీలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కృష్ణమూర్తి విద్యార్థులకు వినూత్న రీతిలో బోధన చేస్తున్నారు. తమ పాఠశాలలో విద్యార్థులు పాఠ్యపుస్తకాలలో ఉన్నవి చూసి చదవడం, రాయడం బొమ్మలు వేయటానికి పడుతున్న ఇబ్బందులను గుర్తించారు. వారికి సులువుగా అర్థమయ్యేలా అవగాహన కలిగించుకునేలా వినూత్న బోధన విధానాన్ని పుస్తక రూపంలో ముద్రించారు. 3,4,5 తరగతులకు సంబంధించిన తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాలలో 9 రకాల వర్క్ పుస్తకాలను చిత్రాలు సంకేతాలతో కూడిన పుస్తకాలను రూపొందించారు. పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహం ఉపాధ్యాయుని కృషిని అభినందించారు. ఈ పుస్తకాల వల్ల విద్యార్థులు కనీస అభ్యాసన స్థాయికి వెళతారని ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయిని తెలిపారు. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తింపు లభించిందని... ఉపాధ్యాయునిగా పనిచేయటానికి ఒక ఏడాది కాలమే ఉన్నందున విద్యార్థులకు నూతన పద్ధతిలో విద్యా విధానాన్ని రూపొందించడానికి ప్రయత్నించానని కృష్ణమూర్తి తెలిపారు.
నూతన పద్ధతుల్లో ఉపాధ్యాయుడి బోధన - tallarevu
తూర్పుగోదావరి జిల్లా నీలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న కృష్ణమూర్తి వినూత్న రీతిలో బోధన చేస్తున్నారు.
ఉపాధ్యాయుడు