Deers: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ దిగువన పులసలంకలో రాష్ట్ర జంతువు కృష్ణజింకలు ఎక్కువగా ఉంటున్నాయి. వరదలకు కొన్ని బొబ్బర్లంక వైపు చేరాయి. వాటిలో కొన్ని ప్రవాహాన్ని ఈది ఒడ్డుకు చేరే సమయంలో కుక్కల బారిన పడి చనిపోతున్నాయి. కాకినాడ టెరిటోరియల్ రేంజ్ ఫారెస్ట్ అధికారి టి.సత్యనారాయణ, రాజమహేంద్రవరం డిప్యూటీ రేంజ్ అధికారి పద్మావతి సోమవారం కడియపులంకలో జింకలు ఉన్న ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. ఇప్పటి వరకు మూడు మృతిచెందాయని మరో రెండు తమ పర్యవేక్షణలో ఉన్నాయని చెప్పారు. జింకల్ని రక్షించేందుకు యానాం, రాజమహేంద్రవరం గ్రామీణ లంకగ్రామాలు, ఆత్రేయపురం మండలాల్లోని ముంపు ప్రాంతాల్లో రెండు బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు.
Deers: వరద బీభత్సానికి చెల్లాచెదురై...శునకాల దాడిలో బలై..
Deers: గోదావరి వరద ఉద్ధృతితో లంకల్లోని కృష్ణజింకల మనుగడకు ముప్పు ఏర్పడింది. వరద బీభత్సానికి చెల్లాచెదురై బయటకు వస్తూ... శునకాల దాడితో ప్రాణాలు విడుస్తున్నాయి. జింకల్ని రక్షించేందుకు యానాం, రాజమహేంద్రవరం గ్రామీణ లంకగ్రామాలు, ఆత్రేయపురం మండలాల్లోని ముంపు ప్రాంతాల్లో రెండు బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు.
లంకలో కృష్ణజింకలు