తూర్పు గోదావరి జిల్లా తుని మండలం హంసవరంలో ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రైల్వే పట్టాలకు దగ్గరలో రహదారి పక్కన ముళ్ళ పొదల్లో ఈ మృతదేహం పడి ఉంది. పూర్తిగా కుళ్ళి పోయి గుర్తు పట్టలేని పరిస్థితిలో ఉంది. ఘటనాస్థలంలో లభించిన కొన్ని ధ్రువపత్రాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి అసోం రాష్ట్రానికి చెందిన వైద్య విద్యార్థిగా అనుమానిస్తున్నారు.
హంసవరం రైల్వేపట్టాల పక్కన.. ముళ్లపొదల్లో మృతదేహం - హంసవరం
తూర్పు గోదావరి జిల్లా తుని మండలం హంసవరం పరిధిలోని రైల్వే పట్టాల సమీపంలో.. ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
హంసవరం రైల్వేపట్టాల సమీపంలో ముళ్లపొదల్లో మృతదేహం