ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్మశానవాటికల వద్ద మృతదేహాలతో అంబులెన్స్​లు - east godavari district latest news

రెండో దశ కరోనా విజృంభిస్తున్న వేళ పాజిటివ్​ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆస్పత్రి మార్చురీల్లో శవాలు పేరుకుపోతున్నాయి. శ్మశానవాటికల్లో చితి మంటలు రగులుతూనే ఉన్నాయి.

dead bodies
శ్మశాన వాటికలో మృతదేహాలు

By

Published : May 8, 2021, 9:41 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో కొవిడ్ మరణాల సంఖ్య పెరిగిపోతోంది. జీజీహెచ్​తో పాటు వివిధ ఆస్పత్రులు, ఇళ్లలో చనిపోయిన వారి మృతదేహాలు శ్మశానవాటికలకు తరలిస్తూనే ఉన్నారు. కాకినాడలో విజ్జపురెడ్డి వారి హిందూ శ్మశానవాటికలో నిత్యం అంత్యక్రియలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయినా.. మృతదేహాలతో అంబులెన్స్​లు వేచి ఉంటున్నాయి. కొవిడ్ సృష్టిస్తున్న విలయానికి చితి మంటలు నిరంతరం రగులుతూనే ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details