ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేర్వేరు ఘటనల్లో... తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తెలు - తండ్రికి దహనసంస్కారాలు నిర్వహించిన కూతురు

రెండు వేర్వేరు ఘటనల్లో అనారోగ్యంతో మృతి చెందిన తండ్రికి కుమార్తెలు తలకొరివి పెట్టి దహనసంస్కారాలు నిర్వహించారు. కూమారులు లేని లోటు తీర్చి... అంత్యక్రియలకు హాజరైన పలువురిచే కన్నీరు పెట్టించారు.

వేర్వేరు ఘటనల్లో...తండ్రికి తలకొరివి పెట్టిన తనయలు
వేర్వేరు ఘటనల్లో...తండ్రికి తలకొరివి పెట్టిన తనయలు

By

Published : Dec 3, 2020, 10:16 PM IST

మృతిచెందిన కన్న తండ్రికి కూతరు తలకొరివి పెట్టిన ఘటన తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో జరిగింది. ప్రత్తిపాడుకు చెందిన ప్రముఖ న్యాయవాది జనుపల్లి ప్రసాద్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు కుమారులు లేకపోవటంతో దుఃఖాన్ని దిగమింగుకొని కన్నకూతరే దహనసంస్కరాలు నిర్వహించింది. ఈ హృదయ విదారక ఘటన పలువురిచే కంటతడి పెట్టించింది. గతంలో బార్ అధ్యక్షుడిగా పనిచేసిన ప్రసాద్ బాబు మృతి పట్ల పలువురు న్యాయవాదులు సంతాపం ప్రకటించారు.

విశాఖలో...

మరో ఘటనలో విశాఖ జిల్లా సూరెడ్డిపాలెంలో అనారోగ్యంతో మృతిచెందిన గుంగునాయుడుకి కూడా కూమార్తె లక్ష్మీ అంత్యక్రియలు నిర్వహించింది. గుంగునాయుడికి కూమారులు లేకపోవటంతో దహనసంస్కారాల బాధ్యతను కుమార్తె తీసుకుకుంది. హిందూ సంప్రదాయం ప్రకారం దహనసంస్కారాలు నిర్వహించి పలువురిచే కన్నీరు పెట్టించింది.

ఇదీచదవండి

ట్రాలీ బోల్తా- పెళ్లి కొడుకు సహా ఆరుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details