ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా నేతల అండతో బెదిరింపులు.. ఎస్పీకి తల్లీ, కూతురు ఫిర్యాదు - తూర్పు గోదావరిలో తండ్రిపై ఫిర్యాదు చేసిన కుమార్తె న్యూస్

తమ ఆస్తిని కాజేసేందుకు కొందరు వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారని తూర్పు గోదావరి జిల్లా అవిడికి చెందిన తల్లీ, కూతురు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగానే తన తండ్రిని.. కుటుంబం నుంచి విడదీసే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

daughter complaint to sp on father in east godavari
daughter complaint to sp on father in east godavari

By

Published : Mar 10, 2021, 12:37 PM IST

వైకాపాకు చెందిన కొందరు నాయకుల వల్ల తమ కుటుంబానికి రక్షణ కొరవడిందని కొత్తపేట మండలం అవిడికి చెందిన తల్లీ, కూతురు గవర నాగ సత్యవతి, ఇంద్రాణి వాపోయారు. న్యాయం చేయాలని కోరుతూ కాకినాడలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తండ్రి గవర సత్యనారాయణను తమ నుంచి విడదీసి మాపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. తమ ఆస్తిని కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని వెనుక కొత్తపేట మండల వైకాపా కన్వీనర్‌ ముత్యాల వీరభద్రరావు, చింతం సురేష్‌, ముత్యాల సత్యనారాయణ హస్తం ఉందని ఆరోపించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఎస్పీ కార్యాలయానికి వచ్చామన్నారు.

ABOUT THE AUTHOR

...view details