ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదకరంగా బోటు ప్రయాణం - boat news in east godavari

మిగతా రోజుల్లో ఎలా ఉన్నా వరదల సమయంలో గోదావరి ప్రవాహం ఉద్ధృతంగా ఉంటుంది. ఈ సీజన్​లో పడవలో ప్రయాణించేవారు పడవ సామర్థ్యానికి అనుగుణంగా ఎక్కాలి. ప్రతి ఒక్కరూ విధిగా లైఫ్ జాకెట్ ధరించాలి. అన్నిటికీ మించి ఈసారి కరోనా మహమ్మారి వచ్చి పడింది. ఆ నిబంధనలతో పాటు భౌతిక దూరం, మాస్కు తప్పనిసరి. మరి కోనసీమలో ఒక రేవులో నిబంధనలు పక్కనపెట్టి ఏ విధంగా ప్రయాణిస్తున్నారో మీరూ చూడండి.

ప్రమాదకరంగా బోటు ప్రయాణం
ప్రమాదకరంగా బోటు ప్రయాణం

By

Published : Aug 14, 2020, 3:54 PM IST

ప్రమాదకరంగా బోటు ప్రయాణం

తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని బెల్లంపూడి రేవులో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రేవు ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి పడవలో అజాగ్రత్తగాప్రయాణిస్తున్నారు. ఈ మర పడవలలోని ప్రయాణికులంతా లైఫ్ జాకెట్లు ధరించకుండా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. పైగా కరోనా నేపథ్యంలో పడవల్లో భౌతిక దూరం కూడా పాటించడం లేదు. ఈ పరిస్థితిపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details