తూర్పుగోదావరి జిల్లా తునిలో నిబంధనలు అతిక్రమించి, పరిమితికి మించి ప్రయాణిస్తున్న వాహనాలు తనిఖీ చేశారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో ఉన్న వారిని చూసి రవాణా శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. ఆ వాహనంలో పరిమితికి మించి విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులను తరలిస్తున్న టాటా ఏస్ వాహనంలో మొత్తం 25 మంది ఉన్నారు. ముందు డ్రైవర్ సీట్ పక్కనే ఏకంగా నలుగురు కిక్కిరిసి కూర్చున్నారు. ఇంత మందిని ఎలా ఎక్కించావని.. డ్రైవర్ పై అగ్రహం వ్యక్తం చేసిన అధికారులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇలా పరిమితికి మించి ప్రయాణం చేస్తే ప్రమాదమని తెలియజేసారు. .ఎప్పుడూ..ఏమౌవుతుందో తెలియని పరిణామాలలో ఇలాంటి ప్రయాణాలతో ప్రమాదాలు కొనితెచ్చుకోవడమే అవుతుందని...వీటిపై తల్లితండ్రులకు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
వామ్మో ఇంత చిన్న వాహనంలో అంత మంది పిల్లలా...! - 25 school children
విద్యార్థుల పట్ల పాఠశాలల యజమాన్యాలు, తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, ఊహించని సంఘటనలు జరుగుతున్నాయని తెలిసి కూడా... తమ పిల్లలను భద్రతలేని వాహనాలలో పంపిస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడే వాహన చోదకులు పరిమితులకు మించి విద్యార్థులను ఎక్కించి... ప్రమాదాలకు కారకులౌతున్నారు.
Dangerous travels with 25 school children in one vehicle at thuni in eastgodavari district