పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కనకాయలంక గ్రామ ప్రజల జీవన విధానం తూర్పు గోదావరి జిల్లా వైపు ఉంటుంది. ఇక్కడ కాజ్వే దాటి చాకలి పాలెం వైపు రావాల్సి ఉంటుంది. కాజ్వే వరద నీటిలో చిక్కుకోవటంతో కనకాయలంక ప్రజలు ప్రమాదకరంగా నడిచి బయటకు వస్తున్నారు. గోదావరి వరద పెరుగుతున్న క్రమంలో కోనసీమలోని గౌతమి వశిష్ఠ వైనతేయ నదీ పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
కాజ్వే పైనుంచి ప్రవహిస్తున్న వరద - గోదవరి వరద తాజా వార్తలు
గోదావరి వరద పెరగడంతో తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని చాకలి పాలెం సమీపంలో గల కాజ్వే వరద ముంపునకు గురైంది. కాజ్వే అవతల ఉన్న పశ్చిమగోదావరి జిల్లా కనకాయలంక గ్రామ ప్రజలు బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు.
ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కాజ్వే గోదావరి