తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట దళిత సంఘాల ఐకాస సభ్యులు ఆందోళన నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్లో జరిగిన అక్రమాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అడ్డదారిలో టైం స్కేల్ తెచ్చుకున్నా ఎస్సీయేతర ఉద్యోగ నియామాకాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ కార్యాలయం ఎదుట దళిత సంఘాల ఆందోళన - east godavari district latest news
ఎస్సీ కార్పొరేషన్లో జరిగిన అక్రమాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల సభ్యులు కాకినాడ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.
![కలెక్టర్ కార్యాలయం ఎదుట దళిత సంఘాల ఆందోళన dalit unions protest at kakinada east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7956163-797-7956163-1594288421785.jpg)
కలెక్టర్ కార్యాలయం ఎదుట దళిత సంఘాల ఆందోళన
అక్రమంగా జీతాలు పొందుతున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జీవో ఎంఎస్ 212ను సక్రమంగా అమలు చేయాలని, ఎస్సీ కార్పొరేషన్లో ఎస్సీలకే ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.