తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో.. 130 మంది పేద వైశ్యులకు నిత్యావసరాలు అందించారు. బియ్యం, పప్పులు, బెల్లం ఇలా ఒక్కో కుటుంబానికి సుమారు 1100 రూపాయల విలువ గల కిట్లను అందజేశారు. ఈ కష్ట కాలంలో తమకు తోచిన సాయం చేస్తున్నామని.. అందరూ తమవంతు సహాయం చేయాలని దాతలు సూచించారు.
పేద వైశ్యులకు నిత్యావసరాలు పంపిణీ - రావులపాలెంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక, ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు తమ వంతు చేయూతనందిస్తున్నారు దాతలు. నిత్యావసరాలు, కూరగాయలు ఇలా వారికి తోచిన విధంగా సాయపడుతూ మంచిమనసు చాటుకుంటున్నారు.
![పేద వైశ్యులకు నిత్యావసరాలు పంపిణీ daily needs distributed to poor vysrais at raavulapalem east godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6761540-435-6761540-1586677709985.jpg)
పేద వైశ్యులకు నిత్యావసరాలు పంపిణీ