తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి, డీసీసీబీ ఛైర్మన్ అనంతబాబు పేదలకు నిత్యావసర సరకులు అందజేశారు. టానేజర్ స్వచ్ఛంద సంస్థ సమకూర్చిన నిత్యావసరాలను వేములకొండ, వెట్టిచెలకల, కాకవాడ, సోకులగూడెం, డబ్బువలస గ్రామస్థులకు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యం, కూరగాయలను అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా కష్ట సమయంలో స్వచ్ఛంద సంస్థల సహాయం వెలకట్టలేనిదన్నారు.
రంపచోడవరం నియోజకవర్గంలో నిత్యావసరాలు అందజేత - రంపచోడవరరంపచోడవరం నియోజకవర్గంలో నిత్యావసరాలు అందజేత
కరోనా కష్టకాలంలో స్వచ్ఛంద సంస్థ సేవలు వెలకట్టలేనివని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి అన్నారు. టానేజర్ సంస్థ ఆధ్వర్యంలో సమకూర్చిన నిత్యావసరాలను పేదలకు అందజేశారు.
పేదలకు నిత్యావసరాలు పంపిణీ