ఆరాధించే నటులు పేరుతో సేవా కార్యక్రమాలు చేయడమే నిజమైన అభిమానానికి నిదర్శనమని.. తూర్పుగోదావరి జిల్లా మండపేట జనసేన ఇంఛార్జి వేగుళ్లు లీలాకృష్ణ అన్నారు. మండపేట మెగా అభిమాన యువత పట్టణ అధ్యక్షులు కొంతం నాగేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమానికి లీలాకృష్ణ హాజరయ్యారు. నాగేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన థియేటర్ల సిబ్బందికి నిత్యావసరాలు, కూరగాయలు అందించారు. అందరి హీరోల అభిమానులు ముందుకొచ్చి ఇలాంటివారిని ఆదుకోవాలని సూచించారు.
థియేటర్ల సిబ్బందికి నిత్యావసరాలు పంచిన మెగా ఫ్యాన్స్ - మండపేటలో నిత్యావసరాలు పంచిన మెగా ఫ్యాన్స్
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఉపాధి కోల్పోయిన థియేటర్ల సిబ్బందికి.. పట్టణ మెగా అభిమాన యువత ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందజేశారు.
ధియేటర్ల సిబ్బందికి నిత్యావసరాలు పంచిన మెగా ఫ్యాన్స్