తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కంటైన్మెంట్, రెడ్ జోన్ పరిధిలోని వారికి ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. సుమారు 25వేల కుంటుంబాలకు 18రకాల సరకులు అందించారు. చెరుకూరి కళ్యాణ మండపం వద్ద ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సరకులు ఉన్న వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. తితిదే ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఎంపీని అభినందించారు.
ఎంపీ భరత్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ - రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ
కంటైన్మెంట్ పరిధిలో ఉన్న ప్రాంతాల వారు బయటకు రాకుండా వారికి కావాల్సిన నిత్యావసరాలు ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో రెడ్ జోన్ పరిధిలోని వారికి సరకులు అందించారు.
రెడ్ జోన్ ప్రాంతాల్లో ఎంపీ భరత్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ