ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరవళ్లు తొక్కుతున్న గౌతమి గోదావరి.. కొట్టుకుపోతున్న నావలు - గౌతమి గోదావరి నది

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో గౌతమి గోదావరి నది పరవళ్లు తొక్కుతూ సముద్రంవైపు పరుగులు తీస్తోంది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో గోదావరి నది ఒడ్డున ఉన్న నావలు కొట్టుకుపోతున్నాయి.

cyclone effect in gouthami godavari river in east godavari district
కొట్టుకుపోతున్న నావలు

By

Published : Aug 5, 2020, 3:55 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు ధవళేశ్వరం నుంచి వదులుతున్న నీటితో ముమ్మిడివరం నియోజకవర్గం యానాం వద్ద గౌతమి గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గౌతమి గోదావరితోపాటు మురుముళ్ల వద్ద వృద్ధ గౌతమి గోదావరి సముద్రం వైపు పరుగులు తీస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వీస్తున్న గాలులకు ఒడ్డున ఉన్న మత్స్యకారుల నావలు ఎగిరిపడుతున్నాయి. కొన్ని నావలు కొట్టుకుపోతుండగా మత్స్యకారులు వాటిని ఒడ్డుకు చేర్చారు.

ABOUT THE AUTHOR

...view details