ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాంలో కట్టుదిట్టంగా కర్ఫ్యూ అమలు - 24 hours curfew in yanam

యానాంలో కర్ఫ్యూ కఠినంగా అమలైంది. ప్రధాన కూడళ్లు, రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. బయట ఊళ్ల నుంచి వచ్చేవారిని సరిహద్దు చెక్​పోస్ట్​ వద్ద నిలిపి పోలీసులు వెనక్కి పంపారు.

curfew in yanam for 24 hours due to increasing of covid 19
యానాంలో 24 గంటల పాటు లాక్​డౌన్​

By

Published : Jul 20, 2020, 11:39 AM IST

గడచిన వారం రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు 500 నుంచి వెయ్యికి చేరాయి. జిల్లా కలెక్టర్ 24 గంటలపాటు నిరవధిక కర్ఫ్యూ విధించారు. కలెక్టర్​ ఆదేశాలను పోలీసు యంత్రాంగం పక్కాగా అమలు చేసింది. కేంద్ర పాలిత యానాంలో వారం రోజుల వ్యవధిలో 65 కేసులు వెలుగుచూశాయి. ఈ మేరకు యానాం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా ఆదేశాలు అనుసరించి ఆదివారం ఉదయం 6 గంటలు నుంచి మరుసటి రోజు సోమవారం ఉదయం 6 గంటల వరకు అన్ని రకాల వ్యాపారాలు, నిత్యావసర సరకుల దుకాణాలు, పెట్రోలు బంకులు, మద్యం, మాంసం, చేపల మార్కెట్లు పూర్తిగా మూతబడ్డాయి. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని తాళ్ళరేవు, ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, మండలాల్లోని ప్రజలను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు కట్టడి చేశారు. యానాం వద్ద బాలయోగి వారధిపై వాహనాల రాకపోకలు లేక నిర్మానుష్యంగా ఉంది. పాలు దుకాణాలకు ఉదయం 6 నుంచి 8 సాయంత్రం 6 నుంతి 8 గంటల వరకు అనుమతించారు. మందుల దుకాణాలు, అత్యవసర సర్వీసులకు అన్నివేళలా మినహాయింపు ఉండటంతో ఆసుపత్రికి వేళ్ళేవారిని పోలీసులు పరిశీలించి ప్రయాణాలకు అనుమతిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details