తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కర్ఫ్యూ విధించటంతో కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో వ్యాపారస్థులు స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు. రహదారులపైకి ఎవరూ రాకపోవడంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి,
ప్రత్తిపాడు జగ్గంపేట నియోజకవర్గాలలో కర్ఫ్యూ కట్టుదిట్టంగా పోలీసులు అమలు చేస్తున్నారు. అనుమతి లేకుండా బయట తిరిగే వ్యక్తులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కొందరిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు.
అమలాపురం డివిజన్లో 16 మండలాలు ఉండగా రావులపాలెం మండలంలోని అత్యధికంగా 213 కేసులు నమోదవుతున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితిలో మాత్రమే బయటికి రావాలని తహసీల్దార్ జిలాని అన్నారు.