తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో... ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు పూర్తిస్థాయిలో కర్ఫ్యూ అమలులో ఉంటుందని అమలాపురం ఆర్డీఓ వసంతరాయుడు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
అమలాపురంలోని కొవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ రోగులకు రాష్ట్ర పర్యటకశాఖ ద్వారా భోజన వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అల్పాహారంతో పాటు రెండు పూటల భోజనాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
అమలాపురంలో పూర్తి స్థాయి కర్ఫ్యూ అమలు... ధిక్కరిస్తే కఠిన చర్యలు - తూర్పుగోదావరిలో కరోనా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో... ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు పూర్తిస్థాయిలో కర్ఫ్యూ అమలులో ఉంటుందని అమలాపురం ఆర్డీఓ వసంతరాయుడు తెలిపారు.

అమలాపుంలో పూర్తి స్థాయి కర్ఫ్యూ అమలు
ఇదీ చదవండి: