తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని బూరుగుగుంటలో... దాదాపు 15 కాకులు, ఓ కొంగ మరణించాయి. అమలాపురం రూరల్ మండలం బండారులంకలోనూ ఐదు కాకులు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. అంతటా కరోనా భయం నెలకొన్న సమయంలో కాకుల్లోనూ కొవిడ్-19 వైరస్ ఉందేమోనని స్థానికులు ఆందోళన చెందారు. అమరావతిలోని టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం చేరవేయటంతో.. పశువైద్యాధికారులు చనిపోయిన కాకికి పోస్టుమార్టం నిర్వహించారు. విషాహారం తినటం వల్లనే కాకులు మరణించాయని తెలిపినప్పటికీ... స్థానికుల్లో భయం తగ్గలేదు.
కాకుల మరణం.. స్థానికుల్లో భయం భయం!
తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల కాకులు మరణించటం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. కాకుల్లోనూ కొవిడ్-19 వైరస్ ఉందేమోనని స్థానికులు ఆందోళన చెందారు.
crows died in east godavari