ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యంబాబులకు పట్టని కరోనా భయం! - మద్యంబాబులకు పట్టని కరోనా భయం

కరోనా భయంతో తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రజలు అల్లాడుతుంటే... మద్యం ప్రియులకు మాత్రం అవేవి పట్టడం లేదు. కరోనా వైరస్​ను లెక్కచేయకుండా.., నిబంధనలు ఉల్లంఘించి మద్యం దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు.

మద్యంబాబులకు పట్టని కరోనా భయం..వైన్​షాపుల వద్ద బారులు !
మద్యంబాబులకు పట్టని కరోనా భయం..వైన్​షాపుల వద్ద బారులు !

By

Published : Jun 8, 2020, 12:49 PM IST

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఒకపక్క కరోనా విజృంభిస్తున్నా...మందుబాబులకు మాత్రం అవేవి పట్టడం లేదు. సాయంత్రమైతే చాలు..సినిమా టికెట్లు కోసం బారులు తీరినట్లు మద్యం కోసం బారులు తీరుతున్నారు. కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భౌతిక దూరం పాటించటం మరిచి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు.

కోనసీమ ప్రాంతంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నందున వైన్​షాప్​ల వద్ద మద్యం ప్రియులను కట్టడి చేయాలని నిపుణలు అభిప్రాయపడుతున్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details