కనీస జాగ్రత్తలు పాటించండి... కరోనాను దూరం చేయండి అని ప్రభుత్వాలు ఎంత మొత్తుకుంటున్నా చైతన్యం రావటం లేదు. కరోనా విజృంభిస్తున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపల రేవు జనంతో కిటకిటలాడింది.
రెండు నెలల ఆంక్షల తర్వాత బుధవారం మత్స్యకారులు వేటకు వెళ్లారు. ఫలితంగా.. వందల సంఖ్యలో వ్యాపారులు, మత్స్యకారులు రేవులోకి చేరారు. అక్కడ ఎవరూ సామాజిక దూరం పాటించలేదు. చాలామంది మాస్కులు ధరించలేదు. గంపులుగుంపులుగా సంచరించారు. అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించారు.