తూర్పు గోదావరి జిల్లా అమలాపురంతో పాటు కోనసీమ వ్యాప్తంగా మద్యం దుకాణాల వద్ద మందు బాబులు భౌతిక దూరం పాటించటం లేదు. వారిని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
మాస్ హీరో విడుదలైనప్పుడు ధియేటర్ల వద్ద ప్రేక్షకులు ఏ విధంగా బారులు తీరుతారో అంతకుమించి మందుబాబులు మద్యం కోసం ఎగబడుతున్నారు. వీరు ఇలా అజాగ్రత్తగా ఉంటే కరోనా మహమ్మారి మరింత విజృంభించే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.