ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

crops damage: పోటెత్తిన గోదావరి.. ముంపు ప్రాంతాల పంటలు జలమయం

ఎగువన కురుస్తున్న వర్షాలకు.. గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ ముంపు బారిన పడ్డాయి. కొన్ని మండలాల్లో ఇళ్లన్నీ జలదిగ్భంధం అయ్యాయి. నీట మునిగిన పంటల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. వరదల కారణంగా.. పంటలన్నీ నీటమునిగిపోగా.. అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

crops submerged in floods at east godavari district
పల్లపుభూముల్లో పంటలన్నీ జలమయం

By

Published : Jul 27, 2021, 11:21 AM IST

Updated : Jul 27, 2021, 12:41 PM IST

పల్లపుభూముల్లో పంటలన్నీ జలమయం

గోదావరికి వరద పోటు కారణంగా.. తూర్పుగోదావరి జిల్లాలోని పలు మండలాలు నీటిలో చిక్కుకున్నాయి. జిల్లాలోని పశ్చిమ ప్రాంతం లోతట్టు భూముల్లో కూరగాయల పంటలన్నీ నీటమునిగాయి. వశిష్ఠ, వైనతేయ, గౌతమీ గోదావరి నదీ.. పాయలుగా పోటెత్తడంతో పల్లపు లంక భూముల్లో పంటలు మునిగిపోయాయి. బీర, బెండ, మునగ, పచ్చిమిర్చి, గోరుచిక్కుడు తదితర పంటలు సుమారు వెయ్యి ఎకరాల్లో ముంపునకు గురయ్యాయి.

పి.గన్నవరం, ఆత్రేయపురం, ముమ్మిడివరం, ఐ.పోలవరం, తాళ్లరేవు, సఖినేటిపల్లి తదితర మండలాల్లో లోతట్టు లంక భూముల్లోకి వరద నీరు చేరింది. ఈ కారణంగా సుమారు వెయ్యి ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంటలు నీటిలో మునగడంపై.. రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

వరద ఉద్ధృతి గురించి ముందుగానే సమాచారం ఇస్తే.. పండిన కూరగాయలు కోసుకుంటాం. సమాచారం లేకపోవడం వల్ల పంటలన్నీ నీట మునుగుతున్నాయి. పరిహారం.. భూ యజమానికే వెళుతోంది. కౌలు రైతులకు ఆ నగదు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. -అమ్మిరాజు, కౌలురైతు

ఇదీ చూడండి:

Huge Floods to Sreesailam: శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. 2 రోజుల్లో నిండే అవకాశం!

Last Updated : Jul 27, 2021, 12:41 PM IST

ABOUT THE AUTHOR

...view details