నివర్ తుపాను ప్రభావం..నేలకొరిగిన పంటలు - తూర్పుగోదావరి జిల్లా వార్తలు
నివర్ తుపానుతో తూర్పుగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో పంటలు నేలకొరిగాయి. ఈ ఏడాది వరదలు పలుమార్లు నష్టపరిచాయని...అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంత రైతులను నివర్ తుపాను తీవ్రంగా దెబ్బతీసింది. వరి పంట చేతికందే సమయం కావటంతో...రైతులు ధాన్యం రక్షించుకునే పనిలో ఉన్నారు. ఈ ఏడాది వరదలు పలుమార్లు తమను నష్టపరిచాయని మెట్ట ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల దెబ్బకు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రైతులపై.. మళ్లీ నివర్ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. వరి, పత్తి, కూరగాయలు వంటి పంటలు నీటమునిగాయి. ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాలలో వేల ఎకరాలలో వరి పంట నేలకొరిగింది.