గోదావరి వరదలు కోనసీమ లంక గ్రామాల రైతులను తీవ్రంగా నష్ట పరిచాయి. కోనసీమలో 15 మండలాలకు చెందిన 74 లంక గ్రామాల్లో సుమారు 24 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉద్యాన, వరి పంటలు దెబ్బతిన్నాయి. ప్రత్యేకించి ఉద్యాన పంటలు 18 వేల ఎకరాల్లో నీట మునిగాయి. గోదావరి వరద తగ్గినప్పటికీ 15 రోజులుగా ఆ ప్రాంతాలన్నీ నీటిలోనే ఉన్నాయి.
వరద నీటిలోనే ఉద్యాన పంటలు.. నష్టపోయిన రైతులు - godavari floods2020
గోదావరి వరద బీభత్సానికి లంకగ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారంతా 15 రోజులుగా జలదిగ్భందంలోనే ఉన్నారు. మరో పక్క వేల ఎకరాల్లో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట నోటికందకుండా పోయే సరికి రైతులు ఆవేదన వ్యకం చేస్తున్నారు.
crops damaged due to godavari floods 2020