గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో.... కోనసీమలోని లంక భూముల్లో గత పది రోజులుగా వరద ముంపులో ఉన్న పంటలు క్రమేపీ బయటపడుతున్నాయి. అవి కుళ్లిపోయి కనిపిస్తున్న తీరు ఆవేదన కలిగిస్తోంది. కోనసీమలోని 15 మండలాల్లో వరద తాకిడి ఎక్కువగా ఉంది. ఈ మండలాల్లో ఇప్పటివరకు 23వేల 750 ఎకరాల విస్తీర్ణంలో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు.
తగ్గుతున్న గోదావరి వరద...బయట పడుతున్న పంటలు
గోదావరి ప్రవాహ వేగం తగ్గింది. కోనసీమలోని లంక భూముల్లో గత పది రోజులుగా వరద ముంపులో ఉన్న పంటలు క్రమేపీ బయటపడుతున్నాయి. వరద తాకిడికి పంటలు పూర్తిస్థాయిలో దెబ్బతిని..రైతన్నకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.
వరదకు కుళ్లిపోయిన పంట
లంక భూముల్లో17 వేల 500 ఎకరాల విస్తీర్ణంలో అరటి, మునగ తదితర కూరగాయల పంటలు.... 6వేల 250 ఎకరాల విస్తీర్ణంలో వరి పంటలు వరద నీటిలో మునిగి పోయాయి. ఈ కారణంగా రైతులు నష్టపోయారు.
ఇవీ చదవండి: కృష్ణా నది వరద ఉద్ధృతి.. సామాన్యులకు తప్పని తిప్ప
లు