తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో నివర్ తుపాన్ తీవ్ర ప్రభావం చూపింది. కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాల్లో పలు గ్రామాల్లో వరి చేలు నేలకొరిగాయి. కోత కోసిన వరి పంటతో పాటు.. కోసేందుకు సిద్ధంగా ఉన్న వరి నీటిపాలైంది. పొలాల్లో ఆరబెట్టిన ధాన్యం రాశులు తడిచిపోయాయి. ఎడతెరిపిలేని వర్షాలతో వరి పంట పూర్తిగా దెబ్బతింది. ఖరీఫ్ ప్రారంభం నాటి నుంచి భారీ వర్షాలు, వరదలతో తూర్పుగోదావరి రాజానగరం నియోజకవర్గ పరిధిలోని పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరి కోతల సమయంలో కురిసిన వర్షం రైతులకు తీవ్ర ఆవేదన మిగిల్చింది.
తూర్పుగోదావరి జిల్లాలో నివర్ ప్రభావం..వర్షాలకు దెబ్బతిన్న వరి పంట - తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు
నివర్ తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసాయి. ఈదురు గాలులతో కూడిన వర్షానికి పలు మండలాల్లోని వరి పూర్తిగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట చేజారిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
crop loss in east Godavari district