వరద ఉగ్రరూపం లంక భూముల్లో పంటల మునక - konaseema esat godavari news
ఇటీవల కురిసిన వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా కోనసీమల్లో వరదలు ప్రవాహాం పెరిగింది. దీంతో లంక భూముల్లోని పంటలు నీటమునిగాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు వరదనీటిలో మునిగిపోవటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరద ఉగ్రరూపం లంక భూముల్లో పంటల మునక
గోదావరి వరదలు ఉగ్రరూపం దాల్చడంతో తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో లంక భూముల్లో పంటలు ముంపు బారిన పడుతున్నాయి. రైతులు బీర, బెండ, మునగ, పచ్చిమిర్చి, ఆకుకూరలు తదితర పంటలు పండించారు. ఇప్పుడు వస్తున్న వరదలకు ఈ పంటలు ముంపు బారిన పడుతున్నాయి. దీంతో రైతులు విలవిలలాడుతున్నారు. లంక భూముల్లో ఉన్న పశువులను ముందు జాగ్రత్త చర్యగా రైతులు వాటిని కరకట్టల మీదకు తరలించారు.
ఇవీ చదవండి