తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఉచిత పంటల బీమా ఇవ్వాలని... తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం పెదపూడి తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. వర్షాలకు పెదపూడి మండలంలో సుమారు 4000 ఎకరాలు ముంపుకు గురైందన్నారు. పంట నష్టాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
నష్టపోయిన రైతులకు ఉచిత పంటల బీమా ఇవ్వాలి: నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి - రైతులను ఆదుకోవాలన్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి
వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఉచిత పంటల బీమా ఇవ్వాలని, ఇన్పుట్ సబ్సిడీని పూర్తిస్థాయిలో చెల్లించాలని... తెదేపా నేత నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలని పెదపూడి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
'నష్టపోయిన రైతులకు ఉచిత పంటల బీమా ఇవ్వాలి': నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి