తూర్పుగోదావరి జిల్లాలో దేవాలయాల్లో చోరీకి పాల్పడిన 16 ఏళ్ల బాలున్ని పోలీసులు అరెస్టు చేశామని క్రైం పోలీస్‌స్టేషన్ డీఎస్పీ భీమారావు తెలిపారు. కాకినాడలోని భీమేశ్వర, కుమారస్వామి, బాలత్రిపురసుందరి ఆలయాల హుండీల్లో నగదు దొంగిలించినట్లు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగని గుర్తించినట్లు వెల్లడించారు. పదో తరగది వరకూ చదివి, మద్యం, ఇతర చెడు వ్యసనాలకు బానిసైన నిందితుడు జల్సాల కోసం ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వివరించారు. ఆలయాల రక్షణ దృష్ట్యా అన్నీ ఆలయాలు, ప్రార్ధనా మందిరాలు, మసీదుల వద్ద నిర్వహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీఎస్పీ కోరారు.
జల్సాల అలవాటు పడ్డ బాలుడు.. దేవాలయాల్లో చోరీ - ఆలయాలపై దాడులు తాజా వార్తలు
జల్సాలకు అలవాటు పడి ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న బాలుడిని కాకినాడ నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు డీఎస్పీ భీమారావు తెలిపారు. జిల్లాలో దేవాలయాలపై దాడుల నేపథ్యంలో ఎస్పీ నయీంఅస్మీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కాకినాడ నేర విభాగం డీఎస్పీ