ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మన్యంలో ఆఖరి మజిలీకి తప్పని తిప్పలు

తూర్పుగోదావరి జిల్లా మన్యంలో మరణించిన వారిని ఖననం చేసేందుకు చోటే లేదు. శ్మశానం లేక... వాగులు దాటుతూ కొండల్లో అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. అధికారులు స్పందించి శ్మశానవాటిక ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

By

Published : Jun 26, 2020, 12:54 PM IST

Cremation ground  problems in rampachodavaram
రంపచోడవరంలో శ్మశాన వాటిక సమస్య

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో శ్మశాన వాటికలు లేకపోవడంతో అంతిమ సంస్కారాలు చేసేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామంలో 80 ఏళ్ల లోతా వెంకాయమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించేందుకు శ్మశాన వాటిక లేదు.

దీంతో మైళ్లదూరం పాడెను మోసి ఉద్ధృతంగా ప్రవహించే మదేరు వాగు దాటి... అంత్యక్రియలు నిర్వహించారు. ఏజెన్సీలో శ్మశాన వాటికలు లేకపోవడంకారణంగా గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగు ఉద్ధృతి ఎక్కువైతే అందరి ప్రాణాలకు ప్రమాదమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని గిరిజన సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి.వాట్సాప్​తో సైబర్ నేరగాళ్ల మోసాలు

ABOUT THE AUTHOR

...view details