పెళ్లిరోజు... పేదలకు అన్నదానం - రావులపాలెంలో పెళ్లిరోజు అన్నదానం చేసిన సీఆర్సీ సేవా సంస్థ కార్యదర్శి న్యూస్
లాక్డౌన్ కారణంగా పనులులేక ఇబ్బంది పడుతున్న పేదవారికి రావులపాలెం సీఆర్సీ సేవా సంస్థ కార్యదర్శి బాసటగా నిలిచాడు. తన పెళ్లి రోజు సందర్భంగా 400మంది నిరుపేదలకు అన్నదానం చేశాడు.
పెళ్లిరోజు పేదలకు అన్నదానం
లాక్డౌన్తో పేదవారు, యాచకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి పలువురు దాతలు బాసటగా నిలుస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని సీఆర్సీ సేవా సంస్థ కార్యదర్శి కర్రీ అశోక్ రెడ్డి తన పెళ్లి రోజు సందర్భంగా 400 మంది నిరుపేదలకు అన్నదానం చేశారు.
ఇదీ చూడండి:ఆపత్కాలంలో పేదలకు అండగా నిలుస్తున్న 'ఆర్డీటీ'
TAGGED:
రావులపాలెంలో అన్నదానం న్యూస్