రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురపాలక సంఘాల్లో ఆస్తి పన్నుల పెంపు నిర్ణయం సరికాదని సీపీఎం నాయకులు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మున్సిపల్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. కరోనా ప్రభావంతో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు, పన్నుల పెంపు భారాన్ని ఎలా భరిస్తారని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం రాబట్టుకోలేక స్థానిక సంస్థల నుంచి వసూలు చేయాలని యోచిస్తున్నట్లు ఆరోపించారు. తక్షణం పన్నుల పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
'కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోలేక పన్నులు పెంచడం దారుణం' - Allegations by East Godavari CPM leaders against the government
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సీపీఎం నేతలు నిరసన చేపట్టారు. పురపాలక సంఘాల్లో ఆస్తి పన్నుల పెంపు నిర్ణయం సరికాదని నినాదాలు చేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను రాబట్టుకోలేక పన్నులు పెంచడం ఏమిటని ప్రశ్నించారు.
నిధులు రాబట్టుకోలేక పన్నులు పెంచడం దారుణం