ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దాడి ఘటనలో అరెస్ట్​ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి' - CPIML central committee leaders tour in chinthalooru

తూర్పుగోదావరి జిల్లా చింతలూరులో సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటీ సభ్యులు పర్యటించారు. గ్రామంలో జరిగిన దాడి ఘటనలో అరెస్ట్​ చేసిన దళితులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

చింతలూరులో సీపీఐఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యుల పర్యటన
చింతలూరులో సీపీఐఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యుల పర్యటన

By

Published : Nov 13, 2021, 5:12 PM IST

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం చింతలూరులో జరిగిన దాడి ఘటనలో అరెస్ట్ చేసిన 42 మందిని వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటీ సభ్యులు చింతలూరులో సందర్శించారు. పాఠశాల విద్యాకమిటీ ఎన్నికల్లో దళితులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా... అమాయకులైన దళితులను అరెస్టు చేయడం సమంజసం కాదని అన్నారు. పోలీసుల సహాయంతో అధికార పార్టీ నాయకులు గ్రామంలో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details