ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలవరం నిర్మాణ పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి'

ముఖ్యమంత్రి జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. పోలవరం నిర్మాణ పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. పోలవరం సందర్శనకు అఖిలపక్షాన్ని అనుమతించాలన్నారు.

cpi ramakrishna letter to cm
cpi ramakrishna letter to cm

By

Published : Dec 1, 2020, 12:18 PM IST

పోలవరం నిర్మాణ పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం జగన్​కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి నిధుల బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. సోమవారం విజయవాడలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగిందని.. వైకాపా, భాజపా పార్టీలు మినహా అన్ని రాజకీయ పక్షాలు, రైతు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలని సీపీఐ రామకృష లేఖ ద్వారా కోరారు. అపోహలకు తావు లేకుండా పోలవరం సందర్శనకు అఖిలపక్షాన్ని అనుమతించాలన్నారు. నిర్వాసితులకు ఆర్ అండ్​ ఆర్ ప్యాకేజీ చెల్లించి, పునరావాసం కల్పించాలన్నారు. అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రామకృష్ణ లేఖ రాశారు.

ఇదీ చదవండి: అమరావతే ఆకాంక్ష...ఆత్మవిశ్వాసంతో పోరాటం

ABOUT THE AUTHOR

...view details