ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికుల ఒక్కో కుటుంబానికి రూ.20 వేలు భృతిగా చెల్లించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఇసుక కొరతపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్‌కు లేఖ రాశారు. నాలుగు నెలల నుంచి ఇసుక సమస్య కొనసాగుతుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమని విమర్శించారు. లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారని లేఖలో పేర్కొన్నారు. దీనిపై పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని... ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని రామకృష్ణ కోరారు.
ఇసుక కొరత సమస్యపై ప్రభుత్వానికి సీపీఐ లేఖ - ఇసుక సమస్యపై సీపీఐ
రాష్ట్రంలో ఇసుక సమస్యపై ముఖ్యమంత్రికి సీపీఐ లేఖ రాసింది. భవన నిర్మాణ కార్మికులు ఒక్కో కుటుంబానికి రూ.20 వేలు భృతి చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
![ఇసుక కొరత సమస్యపై ప్రభుత్వానికి సీపీఐ లేఖ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4876914-191-4876914-1572088799751.jpg)
ఇసుక సమస్యపై ముఖ్యమంత్రికి సీపీఐ లేఖ