ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 23, 2021, 6:14 PM IST

ETV Bharat / state

ఎరువుల ధరలు తగ్గించాలని సీపీఐ ధర్నా

పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని కోరుతూ.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని, రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

cpi andolana
cpi andolana

పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక రైతులు నానా ఇబ్బందులూ పడుతుంటే.. ఎరువుల ధరలు 58 శాతం పెంచటం దారుణమని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బీమారావు అన్నారు. తణుకులో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. పెరిగిన ఎరువుల ధరలతో రైతులు కోలుకోలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ పీఎన్​డీ ప్రసాద్​కు వినతి పత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details