తూర్పు గోదావరి జిల్లా మన్యంలోని రాజవొమ్మంగి మండలం జెడ్డంగిలో ఓ ఆవు మాతృ హృదయాన్ని చాటుతోంది. తన బిడ్డతోపాటు మేక పిల్లలకు పాలు ఇస్తూ వాటి ఆకలి తీర్చుతోంది. గిరిజన రైతు తాతారెడ్డి ఆవులతోపాటు మేకల్ని పెంచుతుంటాడు. ఇతని వద్ద ఉన్న ఓ గోవు నాలుగో ఈత ఈనింది. రోజూ తన బిడ్డతో పాటు మేక పిల్లలకు పొదుగు పంచుతోంది.
గోమాత మాతృ హృదయం.. మేకపిల్లలకు పాలిస్తోన్న ఆవు - జెడ్డంగిలో మేక పిల్లలకు పాలిస్తోన్న ఆవు
తల్లి ఎవరికైనా తల్లేనంటూ ఆ గోమాత చాటుతోంది. తన కన్నబిడ్డతో పాటు ఆకలితో అలమటిస్తున్న మేక పిల్లలకు పాలిస్తూ మాతృ హృదయాన్ని చాటుతోంది. తూర్పుగోదావరి జిల్లా జెడ్డంగిలో ఓ ఆవు మేకపిల్లలకు పొదుగు పంచుతూ వాటి ఆకలి తీర్చుతోంది.
మేకపిల్లలకు పాలిస్తోన్న ఆవు